Nellore: జిల్లా వ్యాప్తంగా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం చేపట్టిన పోలీసులు

Nellore: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

V. Narasimhulu, Nellore
Published on: 15 May 2026 11:47 AM IST
Nellore
X

Nellore: జిల్లా వ్యాప్తంగా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం చేపట్టిన పోలీసులు

నెల్లూరు: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించే భారీ వాహనాలు, నిద్రమత్తు వల్ల జరిగే ప్రమాదాలను నివారించే నేపథ్యంలో భాగంగా.. జిల్లా వ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహించారు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల. ప్రతి రోజు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచుతూ, నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

రాత్రి సమయంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణా నివారణ కోసం వాహనాల తనిఖీలు, అనుమానిత వ్యక్తుల పరిశీలన, ముఖ్య ప్రదేశాల్లో నిఘా కొనసాగుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద విషయాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story