Nellore: నీరు లేక ఎండిపోతున్న వరి పైరు.. అధికారులను కోరిన రైతులు, టీడీపీ నేతలు!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో కోత దశలో ఎండిపోతున్న వరి పంటకు నీరు అందించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన రైతులు, టీడీపీ నాయకులు.
Nellore: నీరు లేక ఎండిపోతున్న వరి పైరు.. అధికారులను కోరిన రైతులు, టీడీపీ నేతలు!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాదన్నగారిపల్లి, కుల్లూరు గ్రామాల్లోని డీపీ-3, డీపీ-4 కాలువ పరిధిలో సుమారు 650 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కోత దశకు చేరుకుందని,ఈ దశలో పంటకు కొంత మేర నీరు అవసరమని రైతులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల రైతులతో కలిసి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి కలువాయి తహసీల్దార్ కృష్ణారెడ్డి, డీఈ మస్తానయ్యను కలిసి ఎండి పోతున్న పంటలకు నీరు అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం వరి పైరు కీలక దశలో ఉన్నందున నీరు అందకపోతే పంటపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ఎలినో ప్రభావంతో పైరు కు ఎంత నీరు పెట్టిన సరిపోవడం లేదన్నారు,రైతుల విజ్ఞప్తిపై స్పందించిన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పంటలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కలువాయి నీటి సంఘం అధ్యక్షులు చల్లా విజయభాస్కర్‌రెడ్డి, మాదన్నగారిపల్లి, కుల్లూరు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.




