Gudur: గూడూరులో ఘోరం.. ట్రాన్స్‌ఫార్మర్ చోరీ చేస్తూ తండ్రీకొడుకు మృతి
Gudur: నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం రామలింగాపురంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి యత్నించి విద్యుదాఘాతానికి గురై తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.
Gudur: గూడూరులో ఘోరం.. ట్రాన్స్‌ఫార్మర్ చోరీ చేస్తూ తండ్రీకొడుకు మృతి
నెల్లూరు జిల్లా: గూడూరు రూరల్ మండలం రామలింగాపురంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి వచ్చి విద్యుత్ షాక్ కు గురై తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి సమీపంలోని ఓ తోటలో ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైరు తొలగించే క్రమంలో విద్యుత్ ఘాతకానికి గురై ఇద్దరు మృతదేహాలు ఖాళీ బూడిదయ్యాయి. మృతులు ఓజిలి మండలం సగుటూరు గ్రామానికి చెందిన వెంకటేష్( 45), కిషోర్ (13) లుగా గుర్తించారు.
ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు... ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.




