Nellore: నెల్లూరు ఐటీడీఏలో ముగిసిన మార్కెటింగ్ సొసైటీ ఎన్నికలు

Nellore: నెల్లూరులోని ఐటీడీఏ (ITDA) కార్యాలయంలో గిరిజన ప్రాథమిక కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ల ఎన్నికలు జరిగాయి.

V. Narasimhulu, Nellore
Published on: 12 Jun 2026 9:19 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు ఐటీడీఏలో ముగిసిన మార్కెటింగ్ సొసైటీ ఎన్నికలు

Nellore: నెల్లూరు ఐటీడీఏ లో ప్రశాం తంగా గిరిజన ప్రాథమిక కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఎన్నికలు ఇవాళ ప్రశాంతంగా జరిగాయి. ఐదుగురు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. నెల్లూరులోని ఐటిడిఏ కార్యాల యంలో ఈరోజు గిరిజన ప్రాథమిక కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ల ఎన్నిక జరిగింది. జిల్లా కోపరేటివ్ అధికారి కోటే శ్వరరావు ఆధ్వర్యంలో, వారి సిబ్బంది ఎన్నిక నిర్వహించడమైనది.

మొత్తం సొసైటీలో 214 మంది సభ్యులు ఉన్నారు, వారిలో క్వారం కంటే అధికంగా వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులు హాజరైయ్యారు.

సొసైటీలోని డైరెక్టర్ల పదవీకాలం ముగియడంతో, నేడు మళ్లీ కొత్త డైరెక్టర్ల ఎంపిక నిమిత్తము ఎన్నిక నిర్వహించారు. మొత్తం ఐదు డైరెక్టర్ల పోస్టులకు గాను, ఐదు మంది మాత్రమే నామినేషన్ దాఖలుచేశారు. ఐదు మంది మాత్రమే నామినేషన్ దా ఖలు చేయడంతో ఐదు డైరెక్టర్ పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కోటేశ్వరరావు ప్రకటించారు.

డైరెక్టర్లుగా 1. కెసి పెంచలయ్య, 2. కత్తి ఆదిశేషయ్య, 3. ఎల్లంపల్లి పెంచలయ్య, 4. భూపతి జయరామయ్య, 5. మోపూరు అడివయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికైన పై ఐదుగురు డైరెక్టర్లకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రా లు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన డైరెక్ట ర్లను యానాదుల సంక్షేమ సంఘం నాయకులు, మరియు కార్యకర్తలు, మరియు ఐటీడీఏ సిబ్బంది, మరియు సొసైటీ సిబ్బంది అభినందిం చారు.. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story