Nellore: బీద రవిచంద్ర సవాల్‌కు సై: మాజీ మంత్రి అనిల్ ప్రతిసవాల్!

Nellore: బీసీ సంక్షేమంపై చర్చకు తాను సిద్ధమని, తేదీ, సమయం చెబితే వస్తానని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రతిసవాల్ విసిరారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 27 Aug 2026 6:56 PM IST
Nellore
X

Nellore: బీద రవిచంద్ర సవాల్‌కు సై: మాజీ మంత్రి అనిల్ ప్రతిసవాల్!

బీద రవిచంద్ర సవాల్ కు సయ్యంటూ ప్రతి సవాల్ విసిరారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. బిసి లకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అనే అంశం పై చర్చించేందుకు డేట్,ప్లేస్, టైం చెబితే చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

జగన్ ఈ రాష్ట్రంలో బీసీ లకు ఏమి చేశాడు అనే MLC బీద మాటలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ, చంద్రబాబు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు.

2019 లో బీసీ లకు రిజర్వేషన్ ఇవ్వడం పై సుప్రీం కోర్టుకు వెళ్ళింది టీడీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. 1995 NTR మరణంతోనే అసలు టీడీపీ చచ్చిపోయిందని, 1995 తర్వాత టిడిపి ఏమి చేసిందో దమ్ముంటే బయటికి చెప్పుకోవాలని, నెల్లూరు జిల్లాలో బీసీలకు పదవి ఇచ్చింది YS జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు.

బీద రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్ రావు కు రాజ్యసభ ఇచ్చింది వైసీపీయేనని, SC,ST,BC, మైనార్టీ లకు పెద్దపీట వేసింది జగనేనని అన్నారు. చంద్రబాబు పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, బిసి లకు ఏమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసులు యాదవ్ కు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్టేనా అంటూ ప్రశ్నించారు.

బిసి లకు ఎన్నికలతో పాటు ప్రతి చోట అధిక ప్రాధాన్యం ఇచ్చింది YS జగన్మోహన్ రెడ్డి అని, 2019 లో YCP అధికారం లోకి రాగానే బీసీ లతో పాటు మైనార్టీ,sc నాయకులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారని చెప్పారు. కూటమి 15 ఏళ్లు అధికారం లో ఉంటుంది అంటున్న నాయకులు, ఉప ముఖ్యమంత్రి పదవి బిసిలకు మరో 15 ఏళ్లు ఇవ్వరనే కదా అర్థం అంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story