Nellore: మేము ఇళ్ళు కాదు.. ఏకంగా ఊళ్లే నిర్మించాం.. కాకాణి గోవర్ధన్
Nellore: నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం సమీపంలోని జగనన్న కాలనీని సందర్శించారు.
Nellore: మేము ఇళ్ళు కాదు.. ఏకంగా ఊళ్లే నిర్మించాం.. కాకాణి గోవర్ధన్
Nellore: గృహాల నిర్మాణాలలో ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని, ప్రస్తుత పాలక పక్షం అదే కాలనీలో చేస్తున్న అవినీతిని ఎత్తిచూపి, ప్రజలకు వివరిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఇవాళ ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నేతలతో కలిసి వెంకటాచలం సమీపంలోని జగనన్న కాలనీని సందర్శించారు. అక్కడ జరుగుతున్న తున్న అభివృద్ధిని పరిశీలించారు.
అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వ హయాంలో తాము ఇళ్ళు కాదు ఊళ్లు నిర్మించామని చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి గ్రామాల నిర్మాణంలో అనేక అడ్డంకులు అవరోధాలను సృష్టించిందని , వాటన్నింటినీ అధిగమించి వెంకటాచలం వద్ద , వందలాది మంది నిరుపేదలకు, జాతీయ రహదారి రైల్వే లైనులకు మధ్యలో అత్యంత విలువైన చోట ఒక ఊరును నిర్మించినట్లు కాకాణి చెప్పారు ఇకపై కూడా తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ. పాలక పక్షం చేస్తున్న అవినీతిని వివరిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.




