Nellore: చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్.. మాజీ మంత్రి కాకాణి ధ్వజం

Nellore: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన. చంద్రబాబు ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.

V. Narasimhulu, Nellore
Published on: 3 May 2026 5:32 PM IST
Nellore
X

Nellore: చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్.. మాజీ మంత్రి కాకాణి ధ్వజం

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వీరంపల్లి, మనుబోలు గ్రామాల ల్లో పర్యటించారు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో వ్యవసాయం చేయడం కష్టతరమవుతుందని కాకాణి ఎదుట రైతులు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.

కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులకు, నాయకులకు , ఒకటవ తేదీ కల్లా ప్రత్యక్షమై జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన పెన్షన్ లను కొంతమేర కోత విధించి పంపిణీ చేయడం తప్ప , మరొకటి పట్టించుకున్న పాపాన పోలేదంటూ కాకాణి సమక్షంలో ఎద్దేవా చేశారు గ్రామస్తులు

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా , ఈ ప్రాంతానికి అవసరమైన రోడ్లు ,డ్రైన్ లు ,త్రాగునీటి వసతి , సాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు కల్పించారని గుర్తు చేసుకున్నారు గ్రామస్తులు*

జగనన్న హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇళ్ళు మంజూరు చేసి , పేదవాడికి గూడు కల్పించే లక్ష్యంతో పని చేస్తే , చంద్రబాబు నాయుడు పేదల ఇళ్ల నిర్మాణ విషయంలో పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు

తమకు చెందిన పొలాలను బలవంతంగా ఆక్రమించి , పోలీసుల చేత బెదిరించి తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ లిఖితపూర్వకంగా కాకాణి కి ఫిర్యాదు చేశారు స్థానిక రైతులు

వీరంపల్లి గ్రామంలో వర్షం వస్తే మోకాలు లోతు నీటిలో అవస్థలు పడే వాళ్ళమని , వీరంపల్లి గ్రామంలోని ప్రధాన రహదారిని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి గ్రామస్తులకు శాశ్వతంగా ఇబ్బందులు పాలు కాకుండా కాపాడిన కాకాణి ని మరిచిపోలేమన్నారు వీరంపల్లి వాసులు

వీరంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జెట్టి సుధాకర్ రెడ్డి నూతనంగా ఇళ్ళు నిర్మించుకొని , ఇటీవల గృహప్రవేశం చేయడంతో సుధాకర్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు కాకాణి మనుబోలు మండల కేంద్రంలో ప్రముఖ జర్నలిస్ట్ జగదీష్ కు ఇటీవల మాతృ వియోగం కలగడంతో జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు కాకాణి.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామాలలో అన్ని విధాల అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని, గ్రామాలలో ఎక్కడా మట్టి రోడ్డు అనేది కనిపించకుండా , సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం తో పాటు అవసరమైన చోట, అవకాశం ఉన్నచోట సిమెంట్ డ్రైన్ లు నిర్మించామని, గ్రామాలలో మంచినీటి వసతి కల్పించాలని అనేక వాటర్ ట్యాంకులు మంజూరు చేయించామని గుర్తు చేశారు.

పూర్తయిన స్థితిలో ఉన్న వాటర్ ట్యాంకులను నేడు రంగులు వేసుకొని కూటమి ప్రభుత్వంలో ప్రారంభించుకుంటున్నారని చెప్పారు. వీరంపల్లి గ్రామంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 300 మందికి పెన్షన్ వస్తే , నేడు 600 మందికి పెన్షన్ లు వస్తున్నాయని గ్రామస్తులు చెప్పడం గమనర్హం అని అన్నారు. చంద్రబాబు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని నిట్టనిలువునా మోసం చేశాడని అన్నారు.

జగనన్న ముఖ్యమంత్రిగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి , ఇళ్ల స్థలాలకు లేఅవుట్లు వేసి ,పట్టాలు అందించామని చెప్పారు. ఇళ్ళు లేని నిరుపేదలందరికి ఇళ్లు మంజూరు చేయించి ఊళ్ళకు, ఊళ్లే నిర్మించామని తెలిపారు. గ్రామాలలో జగనన్న కాలనీలలో పర్యటిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేక , జగనన్న చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేక రకరకాల విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్లు పూర్తి చేయడం గాని,

పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించడంలో గాని జగనన్న ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని చెప్పారు. చంద్రబాబు హామీ ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఒక్క ఇళ్ళూ మంజూరు చేయకుండా, జగనన్న హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను చూసి ప్రజలు గొప్పగా చెప్పుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ భరించలేకపోతోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ , జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఏదో ఒక విధంగా విమర్శలతో డైవర్షన్ పాలిటిక్స్ కు పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు 50 సంవత్సరాలు దాటిన వారందరికి పెన్షన్ ఇస్తానని చెప్పి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని, చంద్రబాబు అమరావతి పేరిట అన్ని విధాల దోపిడి కొనసాగిస్తూ, చివరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెట్రోల్, డీజిల్ దొరక్కుండా అమరావతి పేరిట దోపిడీకి పాల్పడడాన్ని ప్రజలు అసహ్యించు కుంటున్నారని చెప్పారు.

కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ విధానాలను , పెట్రోల్, డీజిల్ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టడం చంద్రబాబుకు ఘోర అవమానం జరిగిందని అన్నారు. ఎరువుల ధరలు రోజురోజుకీ పెరగడంతో రైతులు వ్యవసాయం గిట్టుబాటు గాక తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని చెప్పారు. చంద్రబాబు వ్యవసాయాన్ని గురించి పట్టించుకోకుండా రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ,ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్ళదీస్తున్నాడని అన్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా చంద్రబాబును మట్టికరిపించి , మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రి ని చేయడం ఖాయం అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల పెత్తనాన్ని పెంచి పోషిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు, రాబోవు రోజుల్లో సరైన గుణపాఠం చెబుతాం అని అన్నారు.

అధికారంలో ఉన్నా ,లేకున్నా , ప్రజల పక్షాన నిలబడి , ప్రజలకు అన్నివేళలా అండగా నిలుస్తామని అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story