Nellore: నెల్లూరులో ఉచిత లా సెట్ మోడల్ పరీక్ష.. వివరాలు ఇవే
Nellore: నెల్లూరులో ఏప్రిల్ 25న ఉచిత లా సెట్ మోడల్ పరీక్ష. అభ్యర్థులందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ తెలిపింది.
Nellore
Nellore: ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లా సెట్ అభ్యర్థుల కోసం ఉచిత మోడల్ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క శ్రీనయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు.
నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో లెక్ వ్యూ కాలనీ 3వ వీధిలో ఉన్న లిటిల్ బడ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. కులమతాలకు అతీతంగా లా సెట్ రాయబోయే అభ్యర్థులందరూ ఉచితంగా ఈ పరీక్షకు హాజరుకావచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా నక్క శ్రీనయ్య మాట్లాడుతూ, లా సెట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ మోడల్ పరీక్ష ఉపయోగపడుతుందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 9989850670 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Next Story




