Nellore: నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం

Nellore: నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 8 Jun 2026 9:31 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం

Nellore: నెల్లూరు నగరంలోని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఆ సంస్థ అధినేత రమేష్ ఆధ్వర్యంలో.. ఆదివారం పింక్ లైన్స్ ఫెర్టిలిటీ క్లినిక్ అండ్ ఉమెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ ఈ శిబిరానికి హాజరై ప్రారంభించారు.

ఈ శిబిరంలో 20 సంవత్సరాలకు పైగా ఫెర్టిలిటీ రంగంలో అనుభవం కలిగిన సీనియర్ డాక్టర్ ఝాన్సీ వనిత కుమారి పాల్గొని సేవలందించారు. సుమారు వందమందికి పైగా ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని సేవలు పొందారు. అలాగే వారికి థైరాయిడ్, ప్రొలాక్టిన్, రక్త శాతం, షుగర్, స్కానింగ్ తోపాటు పలు రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ మాట్లాడుతూ.. చెన్నైలో అత్యుత్తమ డాక్టర్లను తీసుకొని వచ్చి ప్రజలకు అనేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు సేవలు అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story