Nellore: నెల్లూరు ఆజాద్ సెంటర్లో అమరవీరుల స్థూపం ఆవిష్కరణ
Nellore: నెల్లూరు ఆజాద్ సెంటర్లో అమరవీరుల స్మారక స్థూపాన్ని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆవిష్కరించారు.
Nellore: నెల్లూరు ఆజాద్ సెంటర్లో అమరవీరుల స్థూపం ఆవిష్కరణ
Nellore: నెల్లూరు నగరంలోని ఆజాద్ సెంటర్లో అమరవీరుల స్మారక స్థూపం మరియు జాతీయ జెండాను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ..
మహానుభావులు దేశం కోసం భావితరాల కోసం వారి జీవితాలను త్యాగం చేశారని తెలిపారు. స్వామి వివేకానంద ప్రజలను చైతన్యపరిచారని అభివర్ణించారు. మహానుభావులు శిక్షలు ఉంటాయని తెలిసి కూడా ముందుకు వచ్చి దేశానికి సేవ చేశారని కొనియాడారు. ఇది త్యాగ ఫలితాలు మనం అనుభవిస్తున్నామని వీరి త్యాగాల రుణం తీసుకోవాలంటే మన జీవితం సరిపోదు అని అన్నారు.
వీరి త్యాగాలని స్మరించుకోవాల్సిన క్రమశిక్షణను పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పై ఉందని అన్నారు. నేటి సమాజంలో బ్రిటిష్ వారు లేరు అనుకోవద్దని నిరక్షరాక్షత వివక్షత లంచగొండితనం ఉన్నాయని వాటి మీద అందరం కలిసి పోరాడుదాం అని పిలుపునిచ్చారు. నేడు జనగణమన పడుతుంటే ఒక ప్రత్యేక అనుభవం వచ్చిందని వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయని అన్నారు.
ఈ సెంటర్లో మరోసారి కుల మతాల పేరుతో మతకలహాలు గొడవలు సృష్టించడం మంచిది కాదని అందరం కలిసి సమాజంలో మార్పు తేవాలని శక్తి లేని దేశం ఎక్కడ ఉంది అంటే ఆధార్ సెంటర్లో ఉందన్న పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ..
దేశం కోసం పోరాడిన మహనీయుల స్థూపాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. కులమతాలు వేరైనా మనం భారతీయులమని గుర్తించుకోవాలన్నారు. మనం పీల్చేగాలి తాగే నీరు తిరిగే ఊరు మనవి కావని అవన్నీ నేడు మనకు సొంతమయ్యాయి అంటే ఆనాటి మహానుభావుల కృషి అని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు కోటమరెడ్డి రామిరెడ్డి మనవడిగా నన్ను సన్మానించిన రోజు ఎంతో సంతోషించానని స్వతంత్ర పోరాటంలో నా రక్తం కూడా ఉందని ఆనందపడ్డానని అన్నారు.
ఈ సందర్భంగా మేయర్ సుజాత మాట్లాడుతూ..
ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు.
డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..
వివాదాలు లేకుండా అందరి ఆమోదయోగ్యంతో కార్యక్రమాన్ని పూర్తిచేసిన అబ్దుల్లా చేసిన మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు మంచి కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, చరిత్రకారులు సయ్యద్ నజీర్, కాళిదాసు పురుషోత్తం లు పాల్గొన్నారు.




