Nellore: గణేష్ ఘాట్‌లో పనులను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!
Nellore: నెల్లూరు గణేష్ ఘాట్‌లో గుర్రపు డెక్క, పూడికతీత పనులను పర్యవేక్షించిన టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. అధికారులకు కీలక ఆదేశాలు.
Nellore: గణేష్ ఘాట్‌లో పనులను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!
Nellore: నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గణేష్ ఘాట్ నందు జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు మరియు పూడికతీత పనులను విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ , మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో కలిసి పనులను పర్యవేక్షించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..
గణేష్ నిమజ్జనానికి అధికారులందరి సహాయ సహకారాలతో ముందస్తుగా చర్యలు చేపట్టామని తెలిపారు గిరిధర్ రెడ్డి.
అధికారులందరూ అప్రమత్తమై ఎక్కడా ఎటువంటి లోపాలు రానివ్వకుండా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను చూసుకోవాలని, చెప్పినటువంటి పనులన్నీ కూడా నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి, గత 4 రోజుల నుంచి గణేష్ ఘాట్ నందు గుర్రపు డెక్కను మరియు పూడికతీత పనులు జరుగుతున్నాయని చెప్పారు. గణేష్ నిమజ్జనాన్ని జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అందరితో కలిసి గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, కో క్లస్టర్ ఇంచార్జ్ విష్ణుప్రియ, 41వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సత్య నాగేశ్వరరావు, కాకు మురళి రెడ్డి, కొండ్లపూడి మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు బాబ్జి, వెంకటేశ్వర్ల ఆచారి, సుధాకర్, బాలాజీ, సతీష్, మస్తానయ్య, కమలాకర్, వేణు, అద్దంకి కృష్ణ, ప్రసాద్, రామచంద్రయ్య, గఫూర్, వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు.




