Nellore: NH-565పై ఘోర ప్రమాదం.. వాగులో పడిన సిలిండర్ల లారీ!
Nellore: నెల్లూరు జిల్లా తెడ్డుపాడు NH-565పై ఖాళీ గ్యాస్ సిలిండర్ల లారీ అదుపుతప్పి పిల్లాపేరు వాగులో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Nellore: NH-565పై ఘోర ప్రమాదం.. వాగులో పడిన సిలిండర్ల లారీ!
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు పిల్లాపేరు వాగు మధ్య జాతీయ రహదారి 565 పై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామూరు వైపు నుంచి కడపకు ఖాళీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బ్రిడ్జిపైకి రాగానే అదుపుతప్పి నేరుగా కింద ఉన్న వాగులో పడిపోయింది. ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి అంబులెన్స్ ద్వారా సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. లారీ వాగులో పడిపోవడంతో కొంతసేపు జాతీయ రహదారి 565 పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Next Story




