Kaluvaya: కలువాయిలో రూ.1.50 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ.. బోర్డుల తొలగింపు

Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లిలో రూ.1.50 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం కలకలం రేపుతోంది.

Madhav Goud, Nellore
Published on: 19 Jun 2026 5:54 PM IST
Kaluvaya
X

Kaluvaya: కలువాయిలో రూ.1.50 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ.. బోర్డుల తొలగింపు

కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లి గ్రామ సమీపంలోని సుమారు రూ.1.50 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమాలపై వార్తలు రావడంతో తహసీల్దార్ కృష్ణారెడ్డి ఆర్ఐ సునీల్ సంఘటన స్థలానికి వెళ్లి ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

కానీ తరువాత రోజు ఆ బోర్డులను తొలగించి అదే స్థలంలో నిమ్మ మొక్కలు నాటారు. ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించినా అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు, ప్రభుత్వ భూమిలో మళ్లీ ఆక్రమణ జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణమేంటని..

ఇది అధికారుల నిర్లక్ష్యమా... లేక ఆక్రమణదారులకు ఎవరి అండ ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే మౌనం వహిస్తుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆక్రమణదారులపై, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story