Nellore: జనసేన అబ్జర్వర్ బొమ్మిడి నాయకర్‌కు నెల్లూరులో ఘన స్వాగతం
Nellore: నెల్లూరు పార్లమెంట్ అబ్జర్వర్‌గా, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ నెల్లూరుకు విచ్చేసారు.
Nellore: జనసేన అబ్జర్వర్ బొమ్మిడి నాయకర్‌కు నెల్లూరులో ఘన స్వాగతం
Nellore: నెల్లూరు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ నెల్లూరు పార్లమెంట్ అబ్జర్వర్‌గా నియమితులై నెల్లూరుకు విచ్చేసిన జనసేన నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కి జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా నిర్వహిస్తున్న పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.
అనంతరం మాట్లాడుతూ, నర్సాపురం పర్యటన సందర్భంగా బొమ్మిడి నాయకర్ అందించిన ఆతిథ్యం ఎప్పటికీ మరువలేనిదని "మర్యాదకు మారు పేరు మా గోదారోళ్లు" అని కొనియాడారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను బొమ్మిడి నాయకర్ దృష్టికి తీసుకెళ్లారు. గుర్తుగా మత్స్యకారుల జీవన విధానాన్ని ప్రతిబింబించే చేప బొమ్మను అందజేసి, నెల్లూరు జిల్లాలోని మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి వారి సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం కల్పించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, కృష్ణమోహన్ రెడ్డి, వేముల శివకృష్ణ, హర్ష, నరహరి, శరవణ, హరి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.




