Vinjamuru: వింజమూరు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేయని నిర్లక్ష్యం
Vinjamuru: వింజమూరులో జాతీయ పండుగ రోజున మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు. జెండా ఎగరవేయని విద్యా, హౌసింగ్, హార్టికల్చర్ శాఖలపై స్థానికుల ఆగ్రహం. చర్యల కోసం డిమాండ్.
Vinjamuru: వింజమూరు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేయని నిర్లక్ష్యం
వింజమూరు: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. నెల్లూరు జిల్లా వింజమూరులోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రం భిన్న పరిస్థితి కనిపించింది. మండల విద్యాశాఖ కార్యాలయం, హౌసింగ్ కార్యాలయం, హార్టికల్చర్ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగరవేయకపోవడంతో పాటు.. కార్యాలయాలను కూడా తెరవకపోవడం చర్చనీయాంశంగా మారింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకుంటుండగా.. వింజమూరులోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసి ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ పర్వదినం రోజున ప్రభుత్వ కార్యాలయాలు తెరవకపోవడంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఈ విషయంపై వింజమూరు మండల విద్యాశాఖ అధికారి పోలు బోయిన రమేష్‌ను వివరణ కోరగా..తమ కార్యాలయం వద్ద గతంలో కూడా జాతీయ జెండాను ఎగరవేయలేదని,గతంలో పనిచేసిన అధికారులు కూడా జెండా ఎగరవేయలేదని తెలిపారు.
అయితే జాతీయ పర్వదినం రోజున ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ, కార్యాలయాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.




