Nellore: ప్రతి గ్రామంలోనూ దైవత్వం.. కూటమి ప్రభుత్వ నూతన ఆధ్యాత్మిక ప్రణాళిక

Nellore: నెల్లూరు జిల్లా విరువూరులో వైభవంగా జరిగిన సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డిల పర్యటన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 April 2026 5:25 PM IST
Nellore
X

Nellore: ప్రతి గ్రామంలోనూ దైవత్వం.. కూటమి ప్రభుత్వ నూతన ఆధ్యాత్మిక ప్రణాళిక

నెల్లూరు జిల్లా: పొదలకూరు మండలం విరువూరులో నూతనంగా ఏర్పాటు చేసిన రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన, కుంబాభిషేకం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లకు వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి లు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధ్యాత్మిక చింతన కోసం ప్రతి గ్రామంలో ఒక ఆలయం నిర్మించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాబోయే రెండేళ్లలో ఐదువేల ఆలయాలు నిర్మాణం చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది అన్నారు. అందుకోసం రూ.750కోట్లు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖలో నూతన వరవడి ఏర్పడిందని, ప్రతి గ్రామంలో దైవత్వానికి అనుసంధానించేలా ఆలయాలు ఉండాలన్నడే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story