Gudur: భక్తిశ్రద్ధలతో గూడూరులో ముగిసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. మూడు ప్రధాన ఆలయాల్లో అమ్మవార్ల గ్రామోత్సవాలు, ప్రత్యేక విన్యాసాలతో పట్టణం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Oct 2026 9:16 AM IST
Gudur
X

Gudur: భక్తిశ్రద్ధలతో గూడూరులో ముగిసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం నిన్న రాత్రి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. 9 రోజుల పాటు వైభవంగా జరిగిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గూడూరులోని మూడు ప్రధాన శక్తిపీఠాల్లో చివరి రోజు ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. పట్టణ పురవీధుల్లో జరిగిన అమ్మవార్ల గ్రామోత్సవాలతో గూడూరు మార్మోగిపోయింది.

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 1. శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం, 2. రాజరాజేశ్వరి దేవస్థానం, 3. ధర్మరాజుల స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.గత 9 రోజులుగా ప్రతిరోజూ అమ్మవార్లకు ఒక ప్రత్యేక అలంకారాన్ని నిర్వహించారు.

బాలా త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి ఇలా 9 అవతారాలలో భక్తులకు దర్శనమిచ్చారు.చివరి రోజు విజయదశమి* సందర్భంగా మూడు ఆలయాల్లో అమ్మవార్లకు విశేష రాజరాజేశ్వరి అలంకరణ, మహాలక్ష్మీ అలంకరణ చేసి, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు.సాయంత్రం 6 గంటలకు మూడు ఆలయాల నుండి ఒకేసారి కలశ గ్రామోత్సవాలు ప్రారంభమయ్యాయి.

అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలలో, రథాలపై ఉంచి.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య పట్టణంలోని పటేల్ వీధి, గాంధీనగర్, కోట వీధి, ప్రధాన బజార్ మీదుగా ఊరేగించారు.ఈ గ్రామోత్సవంలో .తెనాలి నుండి ప్రత్యేకంగా తెప్పించిన తెనాలి బ్యాండ్ మేళంస్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. బ్యాండ్ మేళం హోరులో భక్తులు డ్యాన్సులు చేశారు.అలాగే తీన్మార్ డప్పులదరువులకు యువత కేరింతలు కొట్టింది.

డప్పుల శబ్దానికి పట్టణం దద్దరిల్లింది.అన్నింటికంటే ముఖ్యంగా మహిషాసుర మర్దిని వేషధారులు ప్రదర్శించిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చేతిలో త్రిశూలం పట్టుకుని, రాక్షస సంహారం చేస్తున్నట్లుగా వారు చేసిన విన్యాసాలకు భక్తులు హర హర మహాదేవ అంటూ నినాదాలు చేశారు.

ఈ గ్రామోత్సవాన్ని చూడటానికి గూడూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన చెన్నూరు, నెల్లటూరు, చిల్లకూరు, కోట, వాకాడు నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అమ్మవార్లకు కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.sqమొత్తంగా గూడూరులో ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగియడంతో భక్తులంతా సంతోషంగా ఇంటికి వెళ్లారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్