Atmakur: ఆత్మకూరులో ఆధ్యాత్మిక పండుగ.. ఆగస్టు 20న ఘనంగా హనుమాన్ శోభాయాత్ర!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆగస్టు 20న అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర. గ్రామాల వారీగా విస్తృత ప్రచారం చేస్తున్న రామభక్తులు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 13 Jun 2026 12:57 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో ఆధ్యాత్మిక పండుగ.. ఆగస్టు 20న ఘనంగా హనుమాన్ శోభాయాత్ర!

Atmakur: ఈ నెల ఆగస్టు 20వ తేదీ, ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించబడనున్న హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరగనున్నది. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయుటకు రామభక్తులు, హనుమాన్ భక్తులు ఉమ్మడిగా సమాయత్తమై విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా, నిన్న దేపూరు,మహిమలూరు, డీసీపల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించి, గ్రామ ప్రజలను శోభాయాత్రకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని గ్రామపెద్దలు,పూజారులు,ప్రముఖులను కలిసి, ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరారు. పై కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరూ పాల్గొని హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story