Atmakur: ఆత్మకూరులో వాడవాడలా వినాయక చవితి వేడుకలు!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పంటవీధి, సత్రం సెంటర్, నాగేంద్రపురం తదితర ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
Atmakur: ఆత్మకూరులో వాడవాడలా వినాయక చవితి వేడుకలు!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వాడవాడలా వినాయక చవితి మహా పర్వదినం పురస్కరించుకుని వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని పంటవీధి, సత్రం సెంటర్, నాగేంద్రపురం,పలు ప్రధాన కూడళ్లలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ పరిసరాలు గణపతి నామస్మరణతో మార్మోగగా, యువత ఉత్సాహంగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.




