Gudur: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు!
Gudur: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు.
Gudur: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు!
Gudur: నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో గూడూరు వన్ టౌన్ CI శ్రీనివాస్ కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
గూడూరు డివిజన్ పరిధిలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునిపోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా, ఇన్సిడెంట్ ఫ్రీ గా నిర్వహించడమే మా లక్ష్యం.
ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. డబ్బులు పంచినా, మద్యం పంపిణీ చేసినా, ఓటర్లను బెదిరించినా, బూత్ ల వద్ద అల్లర్లు సృష్టించినా వెంటనే కేసులు నమోదు చేస్తాం. ఎవరినీ వదిలిపెట్టం.అంటూ గూడూరు వన్ టౌన్ CI శ్రీనివాస్ హెచ్చరిక జారీ చేశారు.




