Gudur: జగదీష్ హత్య కేసు: భార్య, ప్రియుడికి జీవిత ఖైదు
Gudur: సూళ్లూరుపేట మన్నారు పోలూరు వద్ద జరిగిన జగదీష్ హత్య కేసులో భార్య చిత్ర, ఆమె ప్రియుడు కృష్ణమూర్తికి గూడూరు కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధించింది.
Gudur: జగదీష్ హత్య కేసు: భార్య, ప్రియుడికి జీవిత ఖైదు
గూడూరు: గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో APP వసంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2023 సంవత్సరంలో సులూరుపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నారు. పోలూరు క్రాస్ రోడ్డు వద్ద అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నెల్లూరు చిత్ర అనే మహిళా తన ప్రియుడు కృష్ణమూర్తి తో కలిసి భర్త జగదీష్ ను హత్య చేశారని తెలిపారు.
కేసు విచారణ పూర్తయి ఏడవ అదనపు జిల్లా జడ్జి నాయుడు a1 ముద్దాయి కృష్ణమూర్తి ఏ టు ముద్దాయి చిత్ర కు జీవిత ఖైదు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు జరిమానా విధించారని జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలలు అదనపు శిక్ష విధించారని పేర్కొన్నారు.
ఈ కేసులో నాయుడుపేట డిఎస్పి చెంచు బాబు సిఐలు ఎస్ఐలు సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారని ఈ తీర్పుతో ప్రజల్లో న్యాయ వ్యవస్థ పై నమ్మకం పెరిగిందని వెల్లడించారు ఈ సమావేశంలో లైజనింగ్ ఆఫీసర్ దానం మల్లికార్జున్ పాల్గొన్నారు.




