Gudur: గూడూరు విజయ దుర్గ ఉప పీఠంలో దసరా నవరాత్రి ఉత్సవాలు
Gudur: గూడూరు పటేల్ వీధిలోని శ్రీ విజయ దుర్గ ఉప పీఠంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తాళమ్మ ఆలయం నుంచి పవిత్ర కలశాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు.
Gudur: గూడూరు విజయ దుర్గ ఉప పీఠంలో దసరా నవరాత్రి ఉత్సవాలు
గూడూరు: గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గ ఉపపీఠంలో దసరా ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా గ్రామ దేవత తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో పీఠం నిర్వాహకులు కొటా సునీల్ కుమార్ పూజల నిర్వహించి దేవస్థానం నుండి అమ్మవారి కలిశాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా కుప్పపీఠంకి తీసుకువచ్చారు.
ఆదివారం కలిసస్థాపనతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి నిర్వాహకులు కొట్టా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉప పీఠంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.




