Gudur: వృద్ధాశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కె.నారాయణ!

Gudur: చిల్లకూరు మండలం పారిచేర్ల వారి పాలెంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త చావా వాసుదేవరావు సి.ఆర్. ఫౌండేషన్‌కు ఎకరం భూమి విరాళం.

B NARASIMHA, GUDUR
Published on: 4 Jun 2026 6:18 PM IST
Gudur
X

Gudur: వృద్ధాశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కె.నారాయణ!

Gudur: పేదలకు అండగా నిలవడమే ధ్యేయంగా సి.ఆర్. ఫౌండేషన్ గత మూడు దశాబ్దాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కె.నారాయణ తెలిపారు. చిల్లకూరు మండల పరిధిలోని పారిచేర్ల వారి పాలెంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త చావా వాసుదేవరావు తన సొంత ఎకరం భూమిని సి.ఆర్. ఫౌండేషన్‌కు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా కె.నారాయణ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ ఫౌండేషన్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్‌లో ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ దేశంలోనే ఎంతో గుర్తింపు పొంది, 150 మంది సీనియర్ సిటిజనులకు ఆశ్రయమిస్తోందని, అలాగే మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సి.ఆర్. పాలి క్లినిక్, ఎన్.ఆర్.ఆర్. రీసెర్చ్ సెంటర్ మరియు విశాలమైన గ్రంథాలయం విజయవంతంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే గుంటూరులో నాలుగు ఎకరాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫన్స్ చిల్డ్రన్ హోమ్ నిర్మించబోతున్నామని, కడపలో మూడు ఎకరాల్లో ఏర్పాటు చేసిన హోమ్‌ను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

అంతేకాకుండా, దాత చావా వాసుదేవరావు మరియు ఆయన సతీమణి, కుమారుడు చావా హర్షవర్ధన్ జ్ఞాపకార్థం గూడూరులో సి.ఆర్. ఫౌండేషన్ అనుబంధంగా కొత్త ఓల్డ్ ఏజ్ హోమ్‌ను నిర్మిస్తున్నట్లు నారాయణ ప్రకటించారు. ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న వాసుదేవరావు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పి.పావని, బి.కె.ఎం.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. ప్రభాకర్, సిపిఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జి. శశికుమార్, చిలుకూరు మండల కార్యదర్శి జి. రమేష్, గూడూరు నగర కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story