Gudur: విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న పట్టణం!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరులో జెండా పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భారీ లైటింగ్, ఆకట్టుకునే సెట్టింగులతో పట్టణం దేదీప్యమానంగా మారి, భక్తులతో జనసంద్రంగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Oct 2026 7:02 AM IST
Gudur
X

Gudur: విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న పట్టణం!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే జెండా పండుగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాలతో, యువత కేరింతలతో గూడూరు పట్టణం అంతా పండుగ శోభను సంతరించుకుంది.భారీ సెట్టింగులు, విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న వీధులు.ఆలయ గోపురాన్ని, చుట్టుపక్కల వీధులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. రాత్రి పూట చూస్తే స్వర్గాన్ని తలపిస్తోంది.

చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు.యువత ఈలలు, అరుపులు తూతా తాయిల రచ్చ రచ్చతో సందడిగా మారిన పట్టణం.జెండా పండుగలో యువత హంగామా మామూలుగా లేదు. డీజే సౌండ్లు, కేరింతలతో పట్టణం అంతా.దద్దరిల్లిపోతోంది

జనసంద్రంగా మారిన గూడూరు పట్టణం.ఎక్కడ చూసినా జనాలే కాలు పెట్టడానికి కూడా చోటు లేకుండా గూడూరు వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి.భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచినట్లు ఆలయ కమిటీ తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్