Gudur: పంబలేరు బ్రిడ్జి గుంతల మరమ్మత్తులు పరిశీలించిన ఎమ్మెల్యే!
Gudur: గూడూరు పట్టణంలో పంబలేరు బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలను పూడ్చి చేపట్టిన తాత్కాలిక మరమ్మత్తులను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్వయంగా పరిశీలించి ఆదేశాలిచ్చారు.
Gudur: పంబలేరు బ్రిడ్జి గుంతల మరమ్మత్తులు పరిశీలించిన ఎమ్మెల్యే!
Gudur: గూడూరు పట్టణంలో పంబలేరు బ్రిడ్జ్ వద్ద రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెంటనే స్పందించారు.గూడూరు పట్టణంలోని పంబలేరు బ్రిడ్జ్ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.దీనిని గమనించిన ఎమ్మెల్యే పసం సునీల్ కుమార్ వెంటనే సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి గుంతలను పూడ్చి మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు.
అధికారులు స్పందించి గుంతలను పూడ్చారు.పూడ్చిన గుంతలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వయంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, తాత్కాలిక మరమ్మత్తులు పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పంబలేరు బ్రిడ్జ్ శాశ్వత పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో రోడ్డు మరమ్మత్తులు జరగడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




