Nellore: గూడూరులో రూ.3.15 కోట్లతో మార్కెట్, హెల్త్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
Nellore: నెల్లూరు జిల్లా గూడూరులో రూ.3.15 కోట్ల కూరగాయల మార్కెట్, రూ.1.27 కోట్ల అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు.
Nellore: గూడూరులో రూ.3.15 కోట్లతో మార్కెట్, హెల్త్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
Gudur: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఐసిఎస్ రోడ్డలో 3 కోట్ల 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ కూరగాయల మార్కెట్ షాపుల సముదాయంతో పాటు, పెద్ద మసీదు వద్ద ఒక కోటి 27 లక్షలతో ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. గత వైసిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అస్తవ్యస్తంగా వదిలేసిందని విమర్శించిన ఎమ్మెల్యే, తమ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.
మార్కెట్ షాపులను అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పాత కూరగాయల వ్యాపారస్తులకే కేటాయించగా, లబ్ధిదారులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో మలేరియా కేంద్రంగా ఉండి పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో నిర్మించిన ఈ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య సేవలకు ఎంతో ఉపయోగపడుతుందని, వైద్యులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కాగా, ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ వాడకాన్ని తగ్గించేందుకు గానూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సైకిల్‌పై ఈ కార్యక్రమాలకు విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. పంచాయతీ రాజ్, 15 వ ఫైనాన్స్ నిధుల ద్వారా పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.




