Gudur: గూడూరు పంబలేరు బ్రిడ్జికి రూ.9.26 కోట్లతో శంకుస్థాపన

Gudur: గూడూరు సమీపంలో పదేళ్లుగా నిలిచిపోయిన పంబలేరు బ్రిడ్జి పనులకు రూ.9.26 కోట్లతో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Oct 2026 5:53 PM IST
Gudur
X

Gudur: గూడూరు పంబలేరు బ్రిడ్జికి రూ.9.26 కోట్లతో శంకుస్థాపన

గూడూరు: గూడూరు పట్టణ సమీపంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పంబలేరు బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆర్ అండ్ బి అధికారులు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు ఆర్ అండ్ బి అధికారులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రిడ్జి మంజూరు చేయించామని టిడిపి ప్రభుత్వం ఓడిపోయి వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిపివేశారని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ అండ్ బి శాఖామంత్రి ని తీసుకువచ్చి బ్రిడ్జి సమస్యను తెలియజేశామని మంత్రి తొమ్మిది కోట్ల 26 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వైసిపి నాయకులు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావు ,ఆర్ అండ్ బి శాఖ అధికారులు నాయకులు తానంకి నానాజీ, కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి , శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు ,రహీం ,చంద్రమౌళి ,మోహన్ ,నరసింహులు ,రమేష్ ,భారతి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్