Gudur: గూడూరులో 5K రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాశం సునీల్

Gudur: నెల్లూరు జిల్లా గూడూరులో సెన్సెస్-2027 పై అవగాహన కల్పిస్తూ 5K రన్ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 April 2026 5:23 PM IST
Gudur
X

Gudur: గూడూరులో 5K రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాశం సునీల్

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సెన్సెస్-2027 పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన 5K రన్‌ను స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కీలకమైన జనాభా గణనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్లు అడిగే 34 ప్రశ్నలకు ప్రజలు ఎటువంటి భయం లేకుండా ఖచ్చితమైన సమాచారం అందించాలని, వివరాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచబడతాయని ఆయన స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి ప్రణాళికల కోసం ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story