Gudur: టవర్ సెంటర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ: డీఎస్పీ నివాళులు!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు టవర్ సెంటర్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డీఎస్పీ నరసింహామూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 6:48 PM IST
Gudur
X

Gudur: టవర్ సెంటర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ: డీఎస్పీ నివాళులు!

గూడూరు: నెల్లూరు జిల్లా గూడూరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు గూడూరు పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు. గూడూరు టవర్ సెంటర్ వద్ద జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో DSP నరసింహా మూర్తి పాల్గొని అమర జవాన్ల త్యాగాలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు DSP నరసింహా మూర్తి వన్ టౌన్, టూ టౌన్ CI లు, SI లు, పోలీస్ సిబ్బంది చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని నిలబడ్డారు. వందలాది మంది స్కూల్ విద్యార్థినులు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు .భారత దేశ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక మంది పోలీసు అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు.

అలాంటి వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు గూడూరులో విద్యార్థులతో కలిసి ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు ఘన నివాళి అర్పిస్తున్నాం.

పోలీసు ఉద్యోగం అంటేనే త్యాగం, దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి కుటుంబానికి మనం అండగా ఉండాలి. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు జవాన్లకు ఇది ఘన నివాళి , వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అండగా ఉంటుందని DSP గారు భరోసా ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్