Gudur: గూడూరులో ఘనంగా విద్యార్థుల సేవా కార్యక్రమం!

Gudur: గూడూరులోని ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో గాయత్రి స్కూల్ విద్యార్థులు 15 రోజులకు సరిపడే బియ్యం, కూరగాయలను అందజేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Oct 2026 3:47 PM IST
Gudur
X

Gudur: గూడూరులో ఘనంగా విద్యార్థుల సేవా కార్యక్రమం!

Gudur: గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 15 రోజులకు సరిపడ రైస్ బ్యాగ్స్, వెజిటబుల్స్ అందించి తమ సేవాభావం చాటారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రగతి అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులకు సేవాభావం అలవడాలనే ఉద్దేశంతో శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ లీడర్షిప్ అనే కాన్సెప్ట్ లో భాగంగా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక స్పృహ పెంపొందించాలనే దృక్పథంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి , ఉపాధ్యాయులు నాసిర, మస్తాన్బీ,సుప్రజ, రేవంతి,రజిని,పర్వీన్, హరికృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్