Guduru: గూడూరు: ఆసుపత్రిలో డాక్టర్లు లేరన్న సర్పంచ్!
Guduru: గూడూరు ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎదుట బొల్లెపల్లి సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Guduru: గూడూరు: ఆసుపత్రిలో డాక్టర్లు లేరన్న సర్పంచ్!
Guduru: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా పడకేసాయని, పేద ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని బొల్లెపల్లి గ్రామ సర్పంచ్ బానోత్ మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్‌ను శవ పరీక్ష కేంద్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర వైద్య సమస్యలపై సర్పంచ్ ఆందోళనను తెలియజేశారు.
గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది గిరిజనులు, పేద ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరూ అందుబాటులో ఉండటం లేదని, దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు.
గిరిజన, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల నామమాత్రంగా మారిందని ఆరోపించారు. సాధారణ వైద్యం కోసం కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి పేదలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు.
ఈ సమస్యపై వెంటనే స్పందించి ఆసుపత్రిలో వైద్యుల నియామకం చేపట్టాలని, అలాగే నిరంతరం డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుని, మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఎమ్మెల్యే మురళీ నాయక్‌ను సర్పంచ్ కోరారు.
సర్పంచ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగుదలకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




