Nellore: రొట్టెల పండుగలో జనసేన నేత గునుకుల కిషోర్..ప్రత్యేక ప్రార్థనలు

Nellore: రొట్టెల పండుగలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Jun 2026 11:45 AM IST
Nellore
X

Nellore: రొట్టెల పండుగలో జనసేన నేత గునుకుల కిషోర్..ప్రత్యేక ప్రార్థనలు

నెల్లూరు: బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు జనసేన నాయకులు గునుకుల కిషోర్.

నెల్లూరులో మత సామరస్యానికి ప్రతీకగా, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరుగుతున్న బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని, జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజాసేవను మరింత విజయవంతంగా కొనసాగించాలని ప్రార్థించారు.

అనంతరం గునుకుల కిషోర్ మాట్లాడుతూ...

గత 2018లో పవన్ కళ్యాణ్ నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొని, మత సామరస్యానికి అండగా నిలిచినప్పటి నుంచి, ప్రతి ఏడాది జనసేన పార్టీ తరఫున ఈ మహోత్సవంలో పాల్గొంటున్నామని తెలిపారు.

రొట్టెల పండుగ కుల, మతాలకు అతీతంగా ప్రేమ, శాంతి, సోదరభావాన్ని చాటిచెప్పే గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ మహోత్సవం దేశంలో సామరస్యం, ఐక్యత మరింత బలోపేతం కావడానికి దోహదపడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల,ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి, లతా, కల్యాణి రెడ్డి, కవిత, ప్రవల్లిక, ప్రశాంతి గౌడ్, బారా షహీద్ దర్గా కమిటీ సభ్యులు షాజహాన్,షాహిద్, సల్మాన్, కుమార్,ప్రశాంత్ గౌడ్, శివకృష్ణ, వేముల హర్ష, శరవణ,తరుణ్ తో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story