Vinjamur: వింజమూరులో వినాయక మండపాలకు ఆర్థిక సహాయం!
Vinjamur: వింజమూరు మండలంలో వినాయక చవితి వేడుకలు, అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన యూత్ ఐకాన్ గువ్వల హర్షవర్ధన్ రెడ్డి.
Vinjamur: వింజమూరులో వినాయక మండపాలకు ఆర్థిక సహాయం!
Vinjamur: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వింజమూరు మండలంలో యూత్ ఐకాన్ గువ్వల హర్షవర్ధన్ రెడ్డి సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిలిచారు. మండల సీనియర్ నాయకుడు, ప్రముఖ రియల్టర్ గువ్వల కృష్ణారెడ్డి తనయుడైన హర్షవర్ధన్ రెడ్డి.
మండలంలోని వివిధ గ్రామాలు, కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిర్వాహకులకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించారు.పండుగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలకు అండగా నిలుస్తూ పలు ప్రాంతాల్లోని నిర్వాహకులకు ఆర్థిక సహకారం అందించారు. అలాగే జీవీకే ఎస్టీ కాలనీలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి కూడా సహాయం అందజేశారు.
ఆర్థిక సహాయం వివరాలు
చింతలపాలెం యాదవ సంఘం వినాయక విగ్రహానికి రూ.13,000, కిస్తీపురం ఎస్సీ కాలనీకి రూ.10,000, బుక్కాపురం ఎస్సీ కాలనీకి రూ.5,000, బుక్కాపురంలోని వినాయక విగ్రహానికి రూ.5,000,వింజమూరు రజక కాలనీకి రూ.5,000 అందించారు.అదేవిధంగా ఎర్రబెల్లిపాలెం వైశ్య బజార్‌కు రూ.10,000, నడిమూరుకు రూ.10,000, పాతూరులో రెండు వినాయక మండపాలకు కలిపి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు.
వడ్డిపాలెం వినాయక విగ్రహం నిర్వాహకులకు కూడా తనవంతు సహకారం అందించారు.జీవీకే ఎస్టీ కాలనీలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి సైతం ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.వినాయక చవితి సందర్భంగా మండల ప్రజలందరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
గణనాథుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి,సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు. పండుగలు,సామాజిక కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలోనూ హర్షవర్ధన్ రెడ్డి ముందుంటారని స్థానికులు తెలిపారు.
తనకు సాధ్యమైన మేరకు సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తూ యువతలో స్ఫూర్తిని నింపుతున్నారని కొనియాడారు.యువ నాయకుడిగా మాత్రమే కాకుండా సేవా భావం, దాతృత్వంతో ప్రజలకు దగ్గరవుతున్న వ్యక్తిగా హర్షవర్ధన్ రెడ్డి గుర్తింపు పొందుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.




