Nawabpet: నవాబుపేట రౌడీషీటర్ మనోహర్‌పై పీడీ యాక్ట్ నమోదు

Nawabpet: కలెక్టర్ హిమాన్షు శుక్లా మరియు ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు నవాబుపేట రౌడీషీటర్ పడినకర్ మనోహర్‌పై పీడీ యాక్ట్ (PD Act) అమలు చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 6 May 2026 10:19 AM IST
Nawabpet
X

Nawabpet: నవాబుపేట రౌడీషీటర్ మనోహర్‌పై పీడీ యాక్ట్ నమోదు

నెల్లూరు: నేరాలను అరికట్టడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు పలు కేసుల్లో నిందితుడిపై PD Act అమలు చేయబడింది.

వివరాలు: నెల్లూరు నగరం నవాబుపేట PS పరిధికి చెందిన పడినకర్ మనోహర్ అలియాస్ మను (20 సం॥), రౌడీషీటర్ నం.255గా నమోదై, పలు కేసుల్లో హ్యాబిట్యువల్ ఆఫండర్‌గా గుర్తించబడ్డాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ స్థానికంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడు.

ఇతనిపై మొత్తం 9 కేసులు నమోదు కాగా, వాటిలో:

హత్య – 1, హత్యాయత్నం – 1, కిడ్నాప్ – 1, గాయపరిచిన కేసులు – 2, ఎక్స్టార్షన్ – 4 ఉన్నాయి. సహచరులతో కలిసి దాడులు, బెదిరింపులు, వసూళ్లు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఇతని నిరంతర నేరప్రవర్తన దృష్ట్యా, చట్టప్రకారం PD Act అమలు చేసి నవాబుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాలు, దౌర్జన్యాలు, వసూళ్లు వంటి నేరాలకు పాల్పడే వారిపై PD Act వంటి కఠిన చట్టాల కింద చర్యలు కొనసాగుతాయని జిల్లా పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే నేరస్థులపై రాజీ ఉండదని హెచ్చరించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story