Nellore: నెల్లూరులో వరుణుడి కరుణ.. రోళ్లు పగిలే ఎండల నుంచి ఉపశమనం

Nellore: నెల్లూరు జిల్లాలో గత మూడు నెలలుగా బెంబేలెత్తించిన ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

V. Narasimhulu, Nellore
Published on: 12 Jun 2026 4:57 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో వరుణుడి కరుణ.. రోళ్లు పగిలే ఎండల నుంచి ఉపశమనం

Nellore: రోళ్లు పగిలే ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్క పోత, ఆపై వడగాల్పులు , ఇలా దాదాపు మూడు నెలలుగా భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన నెల్లూరు పై.. ఇవాళ సాయంత్రం వరుణుడు కరుణించాడు. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో , తీరం వెంట ఉపరితల ఆవర్తనం తో, మొత్తంగా నెల్లూరు జిల్లా లో చల్లబడింది. కొద్దిపాటి గాలులు, ఉరుములు, మెరుపులతో, తీరం వెంట వర్షాలు మొదలయ్యాయి.

ముఖ్యంగా నెల్లూరు నగరం లో భారీ వర్షం కురిసింది పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. సాయంత్రం వేళ వర్షంతో కొద్దిసేపు జనజీవనం స్తంభించింది. ఎండలకు ఉక్కిరిబిక్కిరైన తీర ప్రాంత వాసులకు వర్షం రూపంలో కాసింత ఉపశమనం లభించింది.

వర్షానికి ముందు వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దాంతో కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలైన బుజబుజ నెల్లూరు, తల్పగిరి కాలనీ, శివాజీ కాలనీ, ఆర్టీసీ కాలనీ, రెవెన్యూ కాలనీలు జలమయమయ్యాయి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story