Nellore: కలువాయి జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా యోగా దినోత్సవం

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం బివిఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Madhav Goud, Nellore
Published on: 21 Jun 2026 10:47 AM IST
Nellore
X

Nellore: కలువాయి జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా యోగా దినోత్సవం

నెల్లూరు జిల్లా: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కలువాయి బివిఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఎన్సీసీ ఉపాధ్యాయుడు పెంచల పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, హెచ్‌ఎం అబ్బాస్ అలీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెంచలపుల్లయ్య మాట్లాడుతూ యోగా అనేది ఆరోగ్యకరమైన జీవన విధానానికి పునాది అని, ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయని విద్యార్థులకు వివరించారు.

అనంతరం విద్యార్థులందరూ కలిసి వివిధ యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story