Nellore: నిబంధనలు పాటించకుంటే హోటళ్లు సీజ్.. కలెక్టర్ హిమాన్షు శుక్లా

Nellore: నగరంలోని హోటళ్లపై కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఆకస్మిక దాడులు. రియాజ్, బసోటో హోటళ్లకు నోటీసులు జారీ.

V. Narasimhulu, Nellore
Published on: 24 April 2026 9:53 PM IST
Nellore
X

Nellore: నిబంధనలు పాటించకుంటే హోటళ్లు సీజ్.. కలెక్టర్ హిమాన్షు శుక్లా

Nellore: హోటళ్ల పరిసరాలు, వంట గది అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, మాంసాన్ని నిల్వ చేసినా, గడువు తీరిన పదార్థాలను వినియోగించినా హోటళ్ళను సీజ్ చేస్తాం అని హెచ్చరించారు కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఒకసారి వినియోగించిన నూనెను మళ్ళీ వాడరాదని, నిబంధనలు పాటించకుంటే హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్పీ అజిత వేజెండ్ల.

నగరంలోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ అజితా వేజెండ్ల మాట్లాడుతూ.. "నగరంలోని హోటళ్ళను ఎప్పుడైనా ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని... ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని" జిల్లా కలెక్టర్ హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు.

శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కలెక్టర్, ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోటల్ రియాజ్, బసోటో హోటళ్లను తనిఖీ చేసి ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రియాజ్ హోటల్ లో పరిసరాలు పరిశుభ్రంగా లేవని, శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

బిర్యానీని స్వయంగా పరిశీలించారు. కిచెన్ లో ఉన్న చికెన్ ను ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదని, పెరుగు ప్యాకెట్ ఎక్స్పైరీ డేట్ గడువు ఒక్కరోజుతో ముగుస్తుంటే ఇంకా ఎందుకు వాడకుండా ఉంచారని నిర్వాహకులను ప్రశ్నించారు. పెరుగును ఉదయాన్నే తీసుకొచ్చామని సాయంత్రం వంటకానికి వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

హోటళ్ళ నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన తాజా ఆహార పదార్థాలను అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిల్వ ఉంచకూడదని సూచించారు. ప్రధానంగా హోటల్లో పరికరాలు, వంటగది, భోజన శాల అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, తాజా నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించాలని ఆదేశించారు. మాంసాన్ని నిల్వ ఉంచినా, వినియోగదారుల నుంచి హోటళ్ళపై ఏ ఒక్క ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హోటల్ రియాజ్, బసట హోటళ్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంప్రూవ్మెంట్ నోటీసులను జారీ చేశారు. రెండు వారాల్లోగా హోటల్ లను పరిశుభ్రంగా, పరిసరాలను, వంటగదిని అత్యంత పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్ళ నిర్వాహకులకు సూచించారు.

ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు, తూనికల కొలతల అధికారి ఐజాక్,ఆర్డీవో అనూష, తాసిల్దార్ షఫీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story