Nellore: ఎండల తీవ్రత.. జిల్లా ప్రజలకు కలెక్టర్ అలెర్ట్!

Nellore: నెల్లూరు జిల్లాలో వడగాల్పుల దృష్ట్యా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 20 April 2026 7:13 PM IST
Nellore
X

Nellore: ఎండల తీవ్రత.. జిల్లా ప్రజలకు కలెక్టర్ అలెర్ట్!

Nellore: జిల్లాలో వడగాల్పులు మొదలైన దృష్ట్యా, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, గంట గంటకు మంచి నీరు త్రాగాలని సూచించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. సోమవారం స్థానిక గాంధీ బొమ్మ విగ్రహం వద్ద వ్యవసాయ శాఖ,ఫెర్టిలైజర్స్ అసోసియేషన్స్ ఆద్వర్యములో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ..

ప్రభుత్వం, పోలీస్, రెవిన్యూ శాఖలు చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుడా ప్రైవేటు సెక్టార్, సివిల్ అసోసియేషన్లు తదితరము రానున్న 60 రోజులలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలాన్నారు. ప్రజా సేవకు మించిన సేవ లేదని అన్నారు.

ఎక్కువ చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ అందించిన వారికి పోటీలు పెట్టి రానున్న ఆగష్టు -15,2026 న ఇంచార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. కావున జిల్లాలో ఎక్కువ చలివేంద్రాలు ఏర్పాటు చేసి పోటీ కి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నీటి కొరత లేదని, కండలేరు, సోమశిల జలాశయాల్లో సమృద్ధిగా నీటి లభ్యత ఉందన్నారు.

ఈ కార్యక్రమములో జిల్లా వ్యవశాయ అధికారి సత్య వాణి, వివిధ అసోసియేషన్ ల ప్రతినిధులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story