Nellore: వరల్డ్ వెటర్నరీ డే వేడుకలు.. రక్తదాన శిబిరం ప్రారంభం
Nellore: నెల్లూరులో జరిగిన వరల్డ్ వెటర్నరీ డే-2026 వేడుకల్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.
Nellore: వరల్డ్ వెటర్నరీ డే వేడుకలు.. రక్తదాన శిబిరం ప్రారంభం
Nellore: రానున్న 10, 15 సంవత్సరాల్లో పశుసంవర్ధక శాఖ ప్రాధాన్యత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శనివారం పడారుపల్లిలోని ఆర్ వి ఎస్ కళ్యాణ మండపంలో వరల్డ్ వెటర్నరీ డే-2026 ను పశుసంవర్ధక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బండ్రీ ఆఫీసర్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈరోజు నిర్వహించిన వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా ఆహారం మరియు ఆరోగ్యానికి సంరక్షకులుగా పశువైద్యులు అనే నినాదంతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన తదుపరి సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
పసిసంవర్ధక శాఖలో రిటైర్డ్ ఉద్యోగులు మరియు యువ వైద్యుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. జిల్లాలో కోడిగుడ్డు యొక్క వినియోగం చాలా తక్కువగా ఉందని, పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచవలసిన అవసరం ఉందని ఆ విధంగా ప్రజలను అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ఎకానమీలో లైవ్ స్టాక్ జిడిపి అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతున్న ఎకానమీ పరంగా కంట్రీ అభివృద్ధి సాధిస్తుందన్నారు. జిడిపి పెరుగుదల ద్వారా జిల్లా మరియు రాష్ట్రం మరియు దేశం ఇతోధికంగా అభివృద్ధి చెందుతుందన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకమన్నారు.
జిల్లాలో పాల ఉత్పత్తి వినియోగాన్ని పెంచవలసిన అవసరం ఉందన్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని మే, జూన్ నెలలో రక్తం యొక్క అవసరం పెరుగుతుందని తదనుగుణంగా రక్తదానం చేయడం సంతోషమన్నారు. రక్తదానం చేయుట ద్వారా ఇంకొకరికి జీవితాన్ని అందించినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విశ్రాంత వెటర్నరీ డాక్టర్లు నారాయణ, సుబ్బారావు ,మంగేశ్వరరావు సాంబశివరావు ,భాస్కర రావులను సముచిత రీతిలో సత్కరించారు.
తొలిత పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ పశు వైద్య దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. గత 26 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నదని అందులో భాగంగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్లు ఆటలు వంటివి ఏర్పాటు చేయడం జరుగుతున్నదని. ఈరోజు జరిగిన రక్తదాన శిబిరంలో సుమారు 45 మంది రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ పశుసంవర్ధక అధికారిని యశోద, పసి సామర్ధ్యక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




