Nellore: నిరుద్యోగుల పాలిట ‘మదీనా’ భరోసా.. నెల్లూరులో ఘనంగా మెగా జాబ్ మేళా!

Nellore: నెల్లూరులో మదీనా వాచ్ సంస్థ 60వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 May 2026 7:20 PM IST
Nellore
X

 Nellore: నిరుద్యోగుల పాలిట ‘మదీనా’ భరోసా.. నెల్లూరులో ఘనంగా మెగా జాబ్ మేళా!

నెల్లూరు: నెల్లూరు నగరంలో ప్రముఖ వాచీల సంస్థ మదీనా నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. మదీనా ట్రస్టు నిర్వాహకులు ఇంతియాజ్ తమ సంస్థ 60వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని పానకాల రాజా రోడ్డు, హల్తలీమ్ మసీదు వద్ద నిర్వహించిన ఈ జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, హెచ్ ఆర్ హెడ్లు హాజరయ్యారు. వేలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారు.ఈ జాబ్ మేళాలో వందలాది మంది ప్రముఖ ఐటీ కంపెనిల్లో ప్లేస్మెంట్ ఉద్యోగాలు పొందారు. ఏపీ కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు జాబ్ మేళాలోనే ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ప్లేస్మెంట్ ల ఉత్తర్వులను అందించారు.

ఈ సందర్భంగా జాబ్ మేళా నిర్వాహకులు మదీనా వాచ్ సంస్థల అధినేత షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ...తమ వ్యాపార సంస్థ సేవా రంగంలో ఇవాళ జరిగిన జాబ్ మేళా తన జీవితానికి సరిపడా సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రాలలో 16 మదీనా వ్యాపార సంస్థలు నిర్వహిస్తూ ఉన్నామన్నారు.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేని తాము సంస్థ పరంగా నిరుద్యోగులకు సేవ చేయాలన్న లక్ష్యం తో జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు.ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన వారి కళ్ళలో లో చూసిన ఆనందం మరుపురానిదని ఆయన అన్నారు. ఈ జాబ్ మేళా కోసం తాము... తమ స్నేహితుడు భాషా కలిసి మూడు నెలల పాటు ప్రముఖ ఐటీ కంపెనీలు తో సంప్రదింపులు జరిపామన్నారు.తమ వ్యాపార సంస్థ వార్షికోత్సవానికి తగిన తారీకున ఎంపిక చేయగా.. అందుకు ఆయా ఐటీ సంస్థలు అంగీకరించడం జాబ్ మేళా ఇవాళ నిర్వహినట్లు తెలిపారు.జాబ్ మేళా లో ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేయడం మరుపురాని ఘట్టమని ఆయన అన్నారు. ఇది తాను ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేయడం లేదని... వ్యాపార సంస్థల ద్వారా ఆర్థికంగా స్థిరంగా ఉన్న తనకు నిరుద్యోగులకు సేవ చేయాలన్న ఒక లక్ష్యంతో ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story