Nellore: పోతు కొండపై వైభవంగా శ్రీ అంకాళమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మండలం వేపినాపిలోని పుణ్యక్షేత్రమైన పోతుకొండపై వెలసివున్న శ్రీ అంకాళమ్మ దేవస్థానంలో పొంగళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

V. Narasimhulu, Nellore
Published on: 1 Jun 2026 8:18 AM IST
Nellore
X

Nellore: పోతు కొండపై వైభవంగా శ్రీ అంకాళమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మండలం వేపినాపి లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పోతు కొండపై వెలసివున్న శ్రీ అంకాళమ్మ దేవస్థానంలో ఆదివారం పొంగళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అమ్మ వారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. వీకెండ్ ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులతో పోతుకొండ పోటెత్తింది.

అమ్మవారికి ప్రీతీ ప్రాయమైన పొంగళ్లతో పోతుకొండ కోలాహలంగా మారింది. ఇవాళ ఉదయం నుంచి మహిళలు సాంప్రదాయబద్ధంగా కుండలలో పొంగళ్లు పెట్టి,అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.కొండపై వెలసిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి,ధూపదీప నైవేద్యాలతో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. తమను,తమ చల్లని చూపుతో కాపాడాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు.పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.భక్తులు క్రమశిక్షణతో క్యూలైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుని, ప్రసాదాలు స్వీకరించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story