Nellore: రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలించిన ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి
Nellore: నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ అజితా వేజెండ్ల.
Nellore: రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలించిన ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి
నెల్లూరు: బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ–2026 సందర్భంగా ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజి తో కలసి పరిశీలించారు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఈ సందర్భంగా దర్గా ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, భక్తుల రాకపోకలు, క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
రొట్టెల పండుగను ప్రశాంత వాతావరణంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఐజీ తెలిపారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీసు సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
"బందోబస్తు సూచనలు"
1. మెయిన్ దర్గా క్యూ లైన్లు, ఘాట్ ఏరియా, గేట్–1, గేట్–2 వైపు నుండి వచ్చే అప్రోచ్ రోడ్లను నిరంతరం పర్యవేక్షించాలని, రోడ్లపై ఎలాంటి అడ్డంకులు లేకుండా భక్తుల రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్ కార్ట్స్ లేదా ఇతర రోడ్ అబ్స్ట్రక్షన్స్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
2. ముఖ్యమైన ఘట్టమైన గంధ మహోత్సవం సందర్భంగా రాత్రి వేళల్లో బందోబస్తు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
3. దర్గా పరిసర ప్రాంతాలు మరియు పార్కింగ్ ప్రాంతాలను 96 సీసీ కెమెరాలు, 26 డ్రోన్ కెమెరాల ద్వారా 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భారీ జనసమ్మర్థాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
4. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు దొంగతనాలు, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
5. వాహనాల పార్కింగ్ నిర్వహణ అత్యంత కీలకమని, భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక పాస్‌లు ఉన్న వాహనాలు మినహా ఇతర వాహనాలను దర్గా లోపలికి అనుమతించరాదని స్పష్టం చేశారు.
"ట్రాఫిక్ నియంత్రణ చర్యలు"
రొట్టెల పండుగ సందర్భంగా ట్రాఫిక్ రాకపోకలు సజావుగా జరిగేలా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును విజయవంతం చేయాలని సూచించారు.
విధుల్లో అలసత్వం, గైర్హాజరు వంటి అంశాలను తీవ్రంగా పరిగణించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల ద్వారా యాంటీ సబోటేజ్ తనిఖీలు నిరంతరం కొనసాగించాలని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ మరియు QRT బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన వసతులు, భోజన ఏర్పాట్లు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) CH సౌజన్య, AR అదనపు ఎస్పీ AV అప్పారావు , ASP దీక్ష, IPS, DSPలు, ఘట్టమనేని శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




