Nellore: ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో నెల్లూరు నారాయణ విద్యార్థుల సంచలనం!
Nellore: ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో సత్తా చాటిన నెల్లూరు నారాయణ అకాడమీ విద్యార్థులు. జాతీయస్థాయిలో మెరిసిన టాపర్లు. విజేతలను అభినందించిన యాజమాన్యం.
Nellore: ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో నెల్లూరు నారాయణ విద్యార్థుల సంచలనం!
Nellore: జాతీయస్థాయిలో నెల్లూరు నారాయణ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు లభించాయి.. సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో, టాపర్స్ గా నిలిచారు. జాతీయస్థాయి ఫలితాలలో ఓపెన్ క్యాటగిరి లో.. 5, 13, 14, 15, 16 వంటి ర్యాంకులతో పాటు 392, 509, 934, 954, 1916, వంటి ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచారు. నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ నుండి ఓపెన్ క్యాటగిరిలో కుశాల్ రెడ్డి 392వ ర్యాంకు సాధించగా పి అక్షయ వశిష్ట 509వ ర్యాంకు జి. సాయి లిఖిత్ 934 ర్యాంకు శివకుశ్వంత్ 954, విష్ణు జ్ఞాతికా రెడ్డి 1916 వ ర్యాంకు, రామ్ చరణ్ 2608వ ర్యాంకు, టీ లక్ష్మీ తేజ 2744, కే నిఖిల్ 3589వ ర్యాంకు, యశ్వంత్ రెడ్డి 3855వ ర్యాంకు బిల్వనాద్ రెడ్డి 3945 ర్యాంకు, మధుకర్ జస్వంత్ 4353 ర్యాంకు పి రోహిత్ 4744వ ర్యాంకు కె చరణ్ 5,127వ ర్యాంకు, హరీశ్వర్ 5682 వ ర్యాంకు కైవసం చేసుకుని ప్రతిష్టాత్మక ఐఐటి కళాశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా హరినాధపురం నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ "వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి" మెయిన్స్ అడ్వాన్సుడ్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. అనంతరం జిఎం మాట్లాడుతూ..
ఎప్పటి లాగానే నారాయణ విద్యార్థులు IIT, JEE MAINS ఫలితాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. 500 లోపు 1, వెయ్యిలోపు 4, 2000 లోపు 5 మంది, 3000 లోపు 7 మంది,5000 లోపు12 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 126 మంది విద్యార్థులు అడ్వాన్సుడ్ లో అర్హత సాధించారని తెలిపారు. కళాశాలల కోర్ డీన్ జయకుమార్ రాయుడు మాట్లాడుతూ..
జాతీయస్థాయిలో నారాయణా విద్యార్థులు సాధించడం నెల్లూరు కే గర్వకారణం అన్నారు. నారాయణ మైక్రో షెడ్యూల్, ఎర్రర్ అనాలసిస్ ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ తల్లిదండ్రుల సహకారం ఇంతటి ఘన విజయాలకు కారణమన్నారు. ముఖ్యంగా తమ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణలో ఒత్తిడి లేని బోధనా పద్ధతులను అవలంబిస్తున్నామన్నారు. పోటీ పరీక్షలలో పాల్గొనేందుకు వారికి అవసరమైన మనోధైర్యాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ప్రతివారం వారాంతపు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దృఢ సంకల్పంతో ధైర్యంగా పరీక్షలు రాసేందుకు వారికి అవసరమైన శిక్షణ ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజీఎం, మధుసూదన్ రెడ్డి, మురళీ కృష్ణారెడ్డి, కోర్ డీన్ కే శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ కామాక్షమ్మ, అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




