Nellore: చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలు వేస్తే జైలుకే!
Nellore: నెల్లూరు జిల్లా సంగంలో అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
Nellore: చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలు వేస్తే జైలుకే!
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘం సమీపంలో ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని సంగం పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనంలో ఉన్న సుమారు 25 డ్రమ్ముల చికెన్ వ్యర్ధాలను సంగం కొండ సమీపంలో పూడ్చిపెట్టారు. చికెన్ వ్యర్ధాలను తీసుకొస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సంగం ఎస్సై మాట్లాడుతూ మండల పరిధిలో చేపల గుట్టల యజమానులు చికెన్ వ్యర్ధాలను చేపలకు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ చికెన్ వ్యర్ధాలను చేపల గుంటలలో వేస్తే చేపలు తిన్న ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కావున చేపల పెంపకం దారులు వెంటనే చికెన్ వ్యర్ధాలను చేపలగుంటలో వేయడం ఆపివేస్తే అటు ప్రజలకు పర్యావరణానికి హాని కలవకుండా ఉంటుందని తెలిపారు.
Next Story




