Kaligiri: కలిగిరిలో అక్రమ గ్రావెల్ దందా 3 టిప్పర్లు, ఎక్స్కవేటర్ సీజ్!

Kaligiri: కలిగిరి పెద్ద చెరువులో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై పోలీసుల దాడి. ఇరిగేషన్ ఆఫీస్ సమీపంలో తవ్వకాలు, 3 టిప్పర్లు, ఎక్స్కవేటర్ స్వాధీనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2026 9:34 AM IST
Kaligiri
X

Kaligiri: కలిగిరిలో అక్రమ గ్రావెల్ దందా 3 టిప్పర్లు, ఎక్స్కవేటర్ సీజ్!

Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో రాత్రివేళల్లో అక్రమ గ్రావెల్ తరలింపు కలకలం రేపుతోంది. ఇరిగేషన్ కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ అక్రమ తవ్వకాలు,గ్రావెల్ తరలింపు కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

స్థానికుల సమాచారం మేరకు పెద్ద చెరువు నుంచి ప్రతిరోజూ రాత్రివేళల్లో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలు పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో అక్రమ గ్రావెల్ తరలింపుపై పోలీసులకు సమాచారం అందడంతో సిబ్బంది హుటాహుటిన పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు.అక్కడ గ్రావెల్ తరలిస్తున్న మూడు టిప్పర్లతో పాటు ఒక ఎక్స్కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇరిగేషన్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఈ వ్యవహారం సాగుతుండటంతో అధికారుల పర్యవేక్షణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story