Kaluvayi: కలువాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ఆరోపణలు వెల్లువ
Kaluvayi: నెల్లూరు జిల్లా కలువాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోందన్న ఆరోపణలు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.
Kaluvayi
Kaluvayi: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు, ఆదివారం అర్ధరాత్రి సమయంలో కలువాయి హరిజనవాడలోని రేషన్ దుకాణాల నుంచి బియ్యం తరలించే ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ అక్రమ దందాలో గతంలో ఈకేవైసీ టెక్నిషియన్‌గా పనిచేసిన సుమన్ కీలక పాత్ర పోషిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించినప్పటికీ, రేషన్ బియ్యం దందా కొనసాగుతూనే ఉందని అంటున్నారు.
ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి కిలో రూ.10కు కొనుగోలు చేసి, 20వ తేదీ తర్వాత రాత్రి వేళల్లో రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో కొంతమంది రేషన్ డీలర్లు లాభాలు పొందుతున్నారని సమాచారం.
ఈ ఘటనలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అక్రమ రవాణాకు మద్దతు ఇస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై రాపూరు సివిల్ సప్లై డీటీ ఇలియాజ్‌ను సంప్రదించగా, దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




