Nellore: నెల్లూరులో ఈషా గ్రామోత్సవం క్రీడా పోటీలు.. పోస్టర్ ఆవిష్కరణ

Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 25, 26న ఈషా గ్రామోత్సవం క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీల పోస్టర్‌ను శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 24 July 2026 2:55 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఈషా గ్రామోత్సవం క్రీడా పోటీలు.. పోస్టర్ ఆవిష్కరణ

నెల్లూరు: నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఈషా ఫౌండేషన్ సభ్యులు, వాలీబాల్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీలలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబా ల్ నిర్వహిస్తున్నట్లు ఇది గ్రామీణ యువతీ యువకులకు ప్రోత్సాహకాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవం అని తెలియజేశారు ఇందులో విజేతలకు భారీ ప్రైజ్ మనీ ఉందని తదనంతరం విజేతలకు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందని కావున నెల్లూరు జిల్లాకు చెందిన గ్రామీణ యువతి, యువకులు పాల్గొన్నారు పిలుపునిచ్చారు వివరాల కొరకు 92464 24773 నెంబర్ను సంప్రదించాలని రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేజేష్ ,అలేఖ్య ,మహేష్ ,గౌరీ, వరుణ్, తదితరులు పాల్గొన్నారు..

ఈనెల 25, 26, ఈషా గ్రామోత్సవంలో క్రీడా పోటీలు నెల్లూరులో పోస్టర్ ఆవిష్కరించిన ఈషా ఫౌండేషన్ సభ్యులు, వాలీబాల్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story