Nellore: "అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు" జనసేన ఇంటింటి ప్రచారం
Nellore: నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ దీపం ఇళ్ల ప్రాంతంలో "అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు" నినాదంతో జనసేన పార్టీ మూడవ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించింది.
Nellore: "అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు" జనసేన ఇంటింటి ప్రచారం
నెల్లూరు: పవన్ కళ్యాణ్ ప్రజాహిత పాలన, పొంగూరు నారాయణ అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తూ "అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు" నినాదంతో జనసేన మూడవ రోజు ఇంటింటి ప్రచారంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, గునుకుల విజయలక్ష్మి పాల్గొన్నారు.
"అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు" అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పదహరో డివిజన్‌లో విస్తృత ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచారం రాంజీనగర్ 4వ వీధి, 5వ వీధి మధ్య ఉన్న దీపం ఇళ్ల ప్రాంతంలో సాగింది.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వంలో నగరంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి మరింత బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గత రెండేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాకేంద్రీకృత నిర్ణయాలు, పారదర్శక పాలన, ప్రజలకు చేరువైన సంక్షేమ కార్యక్రమాలు మరియు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, గునుకుల విజయలక్ష్మి, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, మోహన కృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, నరహరి, శివ తదితరులు పాల్గొన్నారు.




