Nellore: రాంజీనగర్లో జనసేన హోరెత్తించే ప్రచారం కూటమి విజయం ఖాయమన్న నాయకులు!
Nellore: 21వ డివిజన్ రాంజీనగర్లో జనసేన నేతలు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి.
Nellore: రాంజీనగర్లో జనసేన హోరెత్తించే ప్రచారం కూటమి విజయం ఖాయమన్న నాయకులు!
Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ (పాత 16వ డివిజన్) రాంజీనగర్లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం సాగుతోంది.
ఈ సందర్భంగా ప్రతి గడపను ఆత్మీయంగా పలకరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానికులు ఆత్మీయంగా స్పందిస్తూ, “మేమంతా మీకే ఓటేస్తాం.. మీకు అండగా ఉంటాం” అంటూ తమ మద్దతును తెలియజేయడం జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అనేది సినిమాల్లో చూపించినంత సులభం కాదు. దానికి దూరదృష్టి, నిరంతర శ్రమ, బలమైన సంకల్పం, ప్రజల పట్ల అంకితభావం తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవా స్ఫూర్తి పాలనలో విలువలకు, బాధ్యతకు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతను చాటుతోంది....
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్తో, రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు పడుతుంది.
నెల్లూరు నగరాన్ని మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ కృషి చేస్తున్నారని చెప్పారు. నెల్లూరును ఆధునిక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాటు, అమరావతి రాజధాని నిర్మాణం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నారని చెప్పారు..
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకులతో పాటు నాగేంద్ర బాలు, నరహరి, కృష్ణమోహన్ రెడ్డి, మల్లిరెడ్డి, కోటా వెంకటేష్ ,బాలాజీ, సుమంత్,రాజేష్, వీరమహిళలు ప్రవల్లిక, ప్రశాంతి,సుప్రియ,విజయ, ఆమని, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, కల్పన, పద్మ, లావణ్య తదితరులు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.




