Nellore: ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించాలి..జనసేన నాయకుల ఇంటింటి ప్రచారం!

Nellore: నెల్లూరు నగరంలో కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ జనసేన పార్టీ ఇంటింటి ప్రచారం.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Oct 2026 4:23 PM IST
Nellore
X

Nellore: ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించాలి..జనసేన నాయకుల ఇంటింటి ప్రచారం!

Nellore: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, కార్పొరేషన్ పరిధిలోని ఏ ప్రజా సమస్య అయినా మా దృష్టికి తీసుకువస్తే, 18 నెలల్లో పరిష్కరిద్దాం అని మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ ఆచరణలో చూపిస్తున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తూ జనసేన క్యాంపెయిన్ నిర్వహించింది.

కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహించిన ఈ క్యాంపెయిన్‌లో భాగంగా పాత 16వ డివిజన్, కొత్త 21వ డివిజన్‌లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలకు పాంప్లెట్లు పంపిణీ చేస్తూ, వారు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని నాయకులు కోరారు.

ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని జనసేన నాయకులు తెలిపారు.

అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ సుపరిపాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి దృక్పథంతో కూటమి ప్రభుత్వం సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతోంది. మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ నెల్లూరు నగరాన్ని అభివృద్ధికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నారు. అమరావతి నిర్మాణం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ చరిత్రలో నిలిచిపోయే కార్యానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు..

ఈ క్యాంపెయిన్‌లో కిషోర్ గునుకుల వారి సతీమణి విజయలక్ష్మి గునుకుల తో కుమారి, విజయ, సుప్రియ,లక్ష్మి, నరహరి, ప్రశాంత్ గౌడ్, నాగేంద్ర, బాలు, కృష్ణారెడ్డి, మల్లి రెడ్డి, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE